సొమ్ముంది ఖాతాలో… సతమతం బ్యాంకులో!
సొమ్ముంది ఖాతాలో... సతమతం బ్యాంకులో! కోనరావుపేట యూనియన్ బ్యాంకులో నగదు కొరత ఖాతాదారుల అవస్థలు.. పట్టించుకోని సిబ్బంది కాకతీయ, వేములవాడ: వడ్లు విక్రయించి ఖాతాల్లో జమ అయిన సొమ్మును తీసుకుందామని బ్యాంకుకు వచ్చిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోనరావుపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో శుక్రవారం నగదు కొరత, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. రైతుల వడ్ల విక్రయానికి సంబంధించిన నగదు ఖాతాల్లో జమ కావడంతో ఉపసంహరణ కోసం పెద్ద సంఖ్యలో రైతులు బ్యాంకుకు...