కూర‌గాయ‌ల వ్యాపారులు సిండికేట్‌

కూర‌గాయ‌ల వ్యాపారులు సిండికేట్‌ కృత్రిమ ధరలతో సామాన్యుల దోపిడీ రోడ్ల ఆక్రమణతో ట్రాఫిక్ సమస్యలు మున్సిపల్ కమిషనర్‌కు తుడుం దెబ్బ నేత‌ల ఫిర్యాదు కాకతీయ, మణుగూరు: ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు మండల కూరగాయల మార్కెట్‌లో కొందరు గిరిజనేతర వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమంగా ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లెం కోటి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీలోని గిరిజనులు, పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని...