తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు మునియా తండాలో వైభవంగా వేడుకలు కాకతీయ, కారేపల్లి: మండలంలోని రావోజి తండా పంచాయతీ పరిధి గల మునియా తండాలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. లంబాడీ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తండా వాసులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే తండా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో, నెత్తిన బోనాలతో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి తమ మొక్కులు...