కొమ్మాలలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
కొమ్మాలలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు కాకతీయ,గీసుగొండ : కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శిథిలావస్థకు చేరిన పాత ధ్వజస్తంభం స్థానంలో జూలై 2 నుంచి 5వ తేదీ వరకు వేదశాస్త్రోక్తంగా యాగాలు,హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవనాని రామానుజ జీయర్ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో...