యాదవ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శిగా అనిల్ కుమార్
యాదవ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శిగా అనిల్ కుమార్ కాకతీయ, శంకరపట్నం: యాదవ చైతన్య వేదిక కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన పల్లెవేని అనిల్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. యాదవులు, బీసీల సామాజిక మరియు రాజకీయ చైతన్యం కోసం అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషిని, ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర నాయకత్వం పేర్కొంది....