కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నాకు మద్దతు

కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నాకు మద్దతు కాకతీయ, భూపాలపల్లి / మలహర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బొగ్గు గనుల వేలం విధానానికి వ్యతిరేకంగా, అలాగే సింగరేణి ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన ధర్నాకు బీసీఎస్సీ జేఏసీ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బీసీఎస్సీ జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్ మాట్లాడుతూ, సింగరేణి అధికారులు, ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని పేర్కొన్నారు....