కేసులు తొలగించేదెప్పుడు..?!
కేసులు తొలగించేదెప్పుడు..?! తెలంగాణ ఉద్యమకారుడి ఆవేదన కాకతీయ, చేర్యాల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో నమోదైన కేసులు పదేళ్లు గడిచినా ఇంకా కొనసాగుతుండటంపై ఉద్యమకారులు తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విచారణ నిమిత్తం చేర్యాల కోర్టుకు హాజరైన పలువురు ప్రముఖ ఉద్యమకారులు, తమను వేధిస్తున్న కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినప్పటికీ, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉండటంతో ప్రతిసారీ కోర్టుకు హాజరు కావాల్సి వస్తోందని...