వృద్ధురాలిపై అత్యాచారయత్నం..!
వృద్ధురాలిపై అత్యాచారయత్నం..! కాంగ్రెస్ కౌన్సిలర్ అరెస్టు! కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్ గ్రామంలో ఓ వృద్ధురాలిపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్ రాజ్ సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిద్రిస్తున్న వృద్ధురాలిపై సంపత్ రాజ్ అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆమె గట్టిగా...