ములుగు ఎస్పీని కలిసిన జర్నలిస్టుల బృందం

ములుగు ఎస్పీని కలిసిన జర్నలిస్టుల బృందం వార్తల ప్రచురణపై నోటీసుల జారీ అంశంపై సానుకూల స్పందన కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : వార్తా ప్రచురణపై పోలీసులు జారీ చేసిన‌ నోటీసుల అంశంపై ములుగు జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ సానుకూలంగా స్పందించారు. గురువారం ఎస్పీని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టుల బృందం, తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. వార్తలు రాసినందుకు నోటీసులిచ్చి జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై ఇలాంటి ఒత్తిళ్లు తగవని...