విగ్రహ ప్రతిష్ఠాపనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

విగ్రహ ప్రతిష్ఠాపనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తండాలో శ్రీ జగదాంబ మేరమ్మ, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. తండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను...