చేర్యాల రెవెన్యూలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు

ఖాళీగా ఎమ్మార్వో పోస్టుతో నిలిచిన పాలన స్తంభించిన భూముల క్రయవిక్రయాలు, లావాదేవీలు కాక‌తీయ‌,చేర్యాల : ఇటీవల ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ దిలీప్ నాయక్ వ్యవహారంతో చేర్యాల మండల రెవెన్యూ కార్యాలయంలో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో భూముల రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు వంటి కీలక ప్రక్రియలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్యాలయానికి వస్తున్న ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నతాధికారుల కోసం నిరీక్షిస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌లు చెల్లించి ఒప్పందాలు చేసుకున్న వారు, గడువు ముగుస్తున్నా రిజిస్ట్రేషన్లు పూర్తి...