విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన తహసీల్దార్‌పై వేటు

ప్రజా ఫిర్యాదులు, లంచాల ఆరోపణలతో సస్పెన్షన్ కాకతీయ, ఇబ్రహీంపట్నం: అధికారిక విధుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం, రెవెన్యూ సేవల విషయంలో ప్రజల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులు, అక్రమ లంచాల ఆరోపణలు, ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ కఠిన చర్య తీసుకున్నారు. జిల్లా పరిపాలనకు అందిన నివేదికలు, విచారణలో వెలుగులోకి వచ్చిన...