అసంపూర్తిగా భట్టుపల్లి మినీ స్టేడియం
ఏజెన్సీ వాసులకు 13 ఏళ్లుగా అందని ద్రాక్ష! రూ.2.10 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం కలుపు మొక్కలతో శిథిలావస్థలో క్రీడా ప్రాంగణం తక్షణమే పనులు పూర్తి చేయాలని గిరిజనుల డిమాండ్ కాకతీయ/కరకగూడెం : కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామంలో క్రీడాకారుల కలల ప్రాజెక్టుగా ప్రారంభమైన మినీ స్టేడియం, 13 ఏళ్లు గడిచినా నేటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు, నేడు నిర్లక్ష్యానికి గురై పొదలతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. 2013 మార్చి 16న అప్పటి పినపాక...