పాఠశాలల మూసివేత తిరోగమన చర్య

రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల తగ్గింపును విరమించాలి టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత కాకతీయ, నెల్లికుదురు: పాఠశాలల విలీనం, రేషనలైజేషన్ పేరుతో వేల సంఖ్యలో పాఠశాలలను మూసివేయడం విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని, ఇది పూర్తిగా తిరోగమన చర్య అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత విమర్శించారు. నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పాఠశాలల్లో సమస్యల సేకరణ' కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "రాష్ట్రంలో ఉన్న 27 వేల పాఠశాలలను...