పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి కాకతీయ, మరియు సెంటర్ : ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి...