బావిలో మహిళ మృతదేహం ల‌భ్యం

హత్యా? ఆత్మహత్యా? అని అనుమానాలు హుజురాబాద్ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం కాకతీయ, కరీంనగర్ /హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఒక మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో బావిలో లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పట్టణంలోని ఎస్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న ఒక ఇంటి బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని స్థానికంగా నివసిస్తున్న సునీతగా పోలీసులు గుర్తించారు. ఆమె మెడకు తాడు బిగించి ఉన్న ఆనవాళ్లు ఉండటంతో, ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం...