అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
కాకతీయ, పెద్దవంగర : డబుల్ బెడ్రూమ్ లకు కేటాయించిన రెండున్నర ఎకరాల భూమి యొక్క సరిహద్దులు సరి చేయాలని పెద్దవంగర గ్రామానికి చెందిన గ్రామస్థులు అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా పెద్దవంగర శివారులోని 50/2 సర్వే నంబరు గల భూమిలో డబుల్ బెడ్రూమ్ లు నిర్మించారు.ఆ డబుల్ బెడ్రూమ్లలో గత నాలుగు సవంత్సరాలుగా దళితులమైన మేము ఉంటున్నాము.కానీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ గోడను నిర్మించుకున్నాడని, దాన్ని ప్రశ్నించిన దళితులను బెదిరిస్తున్నాడని...