వల్లంపట్ల గ్రామంలో వెంచర్ అనుమతి వివాదం..

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ కాకతీయ, మద్దూర్ : వల్లంపట్ల గ్రామ పంచాయతీ గల పరిధిలోని ఓ వెంచర్ అనుమతికి సంబంధించిన అంశం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యాదయ్య, హైదరాబాద్‌కు చెందిన బాబు గౌడ్ కలిసి గ్రామ కార్యదర్శిని కలిసి వెంచర్ అనుమతి గురించి వివరాలు అడిగారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త కర్నె మనోహర్, యాదయ్యతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం అక్కడికి వచ్చిన యాదయ్య తల్లి మరియమ్మ, నా కుమారుడిని ఎందుకు తిడుతున్నారు అని ప్రశ్నించగా,...