పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
ప్రేమ పేరుతో బాలికను మోసం కాకతీయ, గీసుగొండ: ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, 2023లో పదో తరగతి చదువుతున్న బాధితురాలికి, హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌కు చెందిన బొడ్డు బన్నీ (21)తో స్నేహితురాలి ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని నమ్మించిన నిందితుడు, అదే ఏడాది మార్చిలో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2024 వరకు పలుమార్లు...