ఇసుక మాఫియాపై రైతుల ఆగ్రహం

పొత్తూర్ వాగులో టిప్పర్ల నిలిపివేత అక్రమ తవ్వకాలను ఆపాలని గ్రామస్థుల నిరసన కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు తీవ్ర కలకలం రేపాయి. మధ్య మానేరు జలాశయం పరిధిలోని వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, గ్రామస్థులు మరియు రైతులు టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు పట్నం శ్రీనివాస్ మాట్లాడుతూ.. అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని...