ట్రాఫిక్ ఉల్లంఘనపై పోలీసుల కొరడా

6 నెలల్లో 1,93,638 కేసులు నమోదు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మోటారు వాహనాల చట్టం కింద మొత్తం 1,93,638 కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10.07 కోట్ల రూపాయల జరిమానా విధించగా, ఇప్పటివరకు 40,653 కేసులకు సంబంధించి 1.57 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ట్రాఫిక్ పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్న పోలీసులు, నేరుగా తనిఖీలతో పాటు నాన్-కాంటాక్ట్...