ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం ఎస్సీ, ఎస్టీ కేసుతో వేధింపులే కారణం? బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణ విషమంగా బాధితుడు రాజేందర్ రెడ్డి పరిస్థితి..! మానకొండూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత కాకతీయ, కరీంనగర్/మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఆయన తనపై తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి...