లైసెన్సులు లేవు.. పన్నులు కట్టరు!

లైసెన్సులు లేవు.. పన్నులు కట్టరు! అధికారుల దృష్టిలో అల్లం, ఉల్లిగడ్డ వ్యాపారులు 'కాకతీయ' కథనంతో కదిలిన యంత్రాంగం.. నోటీసుల జారీ ఏళ్ల తరబడి అనుమతుల్లేకుండానే సాగుతున్న వ్యాపారం మామూళ్ల మత్తులో మార్కెట్ సిబ్బంది.. దర్యాప్తునకు డిమాండ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని పాత బీటు బజారులో ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తూ ఏళ్ల తరబడి సాగుతున్న అల్లం, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వ్యాపారాలపై ఏనుమాముల మార్కెట్ అధికారులు కొరడా ఝళిపించారు. 'కాకతీయ' దినపత్రికలో ఇటీవల వెలువడిన కథనంతో మేల్కొన్న మార్కెటింగ్...