మత్తుకు బానిసవుతున్న యువత
మత్తుకు బానిసవుతున్న యువత మండల కేంద్రంలో జోరుగా అంబర్, గుట్కా, సిగరెట్ విక్రయాలు బెల్ట్ షాపులపై మౌనవ్రతం పాటిస్తున్న శాఖల అధికారులు కాకతీయ, ఆత్మకూరు: తెలంగాణ ప్రభుత్వం సే నో డ్రగ్స్ పేరుతో మాదక ద్రవ్యాల నియంత్రణకు పెద్దపీట వేస్తుంటే, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో యువత, మైనర్ విద్యార్థులు సైతం అంబర్, గుట్కా, సిగరెట్, మద్యం వంటి మత్తు పదార్థాలకు విచ్చలవిడిగా బానిసలవుతున్నారు. ఈ విషయంపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో...