బడిలో పంతుళ్ల పంచాయితీ.. పరస్పరం దాడులు

బడిలో పంతుళ్ల పంచాయితీ.. పరస్పరం దాడులు తరగతి గదిలోనే ఘర్షణతో భయాందోళనలో విద్యార్థులు కేసు నమోదు చేసిన చందుర్తి పోలీసులు కాకతీయ, చందుర్తి : భావి భారతాన్ని తీర్చిదిద్దాల్సిన గురువులే పాఠశాల ఆవరణలో ఘర్షణకు దిగడం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధ్యతల కేటాయింపు విషయంలో గత ఏడాదిగా ప్రధానోపాధ్యాయుడు ఆనందరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం మధ్య నెలకొన్న విభేదాలు శుక్రవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియారిటీని పక్కనపెట్టి జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారనే...