ఎల్గూర్ రంగంపేటలో రెండు నెలలుగా చిమ్మచీకట్లు

ఎల్గూర్ రంగంపేటలో రెండు నెలలుగా చిమ్మచీకట్లు వీధి దీపాలు వెలగక ప్రజల అవస్థలు ప్రమాదాల భయంతో గ్రామస్తుల ఆందోళన కాకతీయ, సంగెం : మండలంలోని ఎల్గూర్ రంగంపేట గ్రామం రెండు నెలలుగా చీకటిలో మగ్గుతోంది. గ్రామంలోని సగానికి పైగా వీధి దీపాలు వెలగక పోవడంతో ప్రజలు రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు పూర్తిగా చీకటిమయంగా మారడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ప్రాణ భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. వీధి దీపాలు లేకపోవడంతో పాములు, వీధి కుక్కల సంచారం, కోతుల ఆగడాలు...