బీఆర్ఎస్‌లో ప్రొటోకాల్ ర‌గ‌డ‌

ములుగు బీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త క‌ల్లోలం జిల్లా నాయకత్వం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధ్య సమన్వయ లోపం ప్రోటోకాల్ వివాదంతో సీనియర్లలో పెరుగుతున్న అసహనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో అయోమయం రాష్ట్ర‌ నాయకత్వం స్పందన కోసం ఎదురుచూపులు కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో...