మంత్రి సీతక్క ఫోటో లేకుండానే జీపీ భ‌వ‌నాల‌కు శంకుస్థాపనలు

దుగ్గొండి మండ‌లం రేకంపల్లిలో చర్చనీయాంశంగా ప్రొటోకాల్ అంశం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఫోటోను విస్మరించిన అధికారులు రాజకీయ వర్గాల్లో భిన్న చ‌ర్చాల‌కు తావిచ్చిన అంశం కాకతీయ, న‌ర్సంపేట టౌన్ : పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా, సంబంధిత శాఖ మంత్రి సీతక్క ఫోటో బ్యానర్‌లో లేకపోవడం స్థానికంగా మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ...