మధిరకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులకు శుభవార్త కాకతీయ ఎడ్యుకేషన్ – ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ జూలై 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాంకేతిక విద్యాభివృద్ధికి కీలక ముందడుగుగా నిలవనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్దేశించిన అన్ని నిబంధనలు,...