భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

ఏన్కూరు పోలీస్ స్టేషన్లో ఘటన తీవ్రంగా గాయపడిన మహిళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు.. తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టింటి గ్రామమైన సాతానిగూడెంలో ఉంటోంది. ఈ క్రమంలో గ్రామ సంఘం ద్వారా...