హార్టికల్చర్ వింగ్‌ను కాపాడండి

టెండర్ షరతులపై బల్దియా కాంట్రాక్టర్ల ఆందోళన వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని క‌మిష‌న‌ర్ ఆదేశాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హార్టికల్చర్ వింగ్‌లో టెండర్ షరతులను మార్చి కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ హార్టికల్చర్ కాంట్రాక్టర్లు సోమవారం బల్దియా గ్రీవెన్స్‌లో కమిషనర్ వెంకన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2008 నుంచి జీడబ్ల్యూఎంసీలో పనిచేస్తున్న ఉద్యానవన కాంట్రాక్టర్లు, బల్దియా పట్టణ జీవవైవిధ్య విభాగం కింద నమోదైన వారు తమ ఆవేదనను కమిషనర్ ముందు...