నిర్బంధాలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు
రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుంది మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కాకతీయ, కరీంనగర్ / మల్యాల: వరద కాలువ నీటిని వెంటనే విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మల్యాల మండలంలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు అడ్డుకుని ప్రివెంటివ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.ఇదే సమయంలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని...