ఎస్‌ఐ సస్పెన్షన్‌పై నెక్కొండలో సంబరాలు

సీపీ చిత్రపటానికి పాలాభిషేకం నెక్కొండలో చర్చనీయాంశంగా ఎస్‌ఐ మహేందర్ సస్పెన్షన్ కాకతీయ, నెక్కొండ : నెక్కొండ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంతో నెక్కొండ మండల కేంద్రంలో కొందరు ప్రజలు సంబరాలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సీపీ శ్వేతారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఐ మహేందర్‌పై వచ్చిన వివిధ అవినీతి ఆరోపణల నేపథ్యంలో శాఖాపరంగా నిర్వహించిన...