జాతీయ రహదారిపై ఇసుక లారీల పార్కింగ్‌కు చెక్..
లారీ అసోసియేషన్‌కు చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి హెచ్చరిక కాకతీయ,చేర్యాల: జాతీయ రహదారిపై ఇసుక లారీలను నిలిపి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి లారీ యజమానులు, డ్రైవర్లకు సూచించారు.ఈ మేరకు బుధవారం చేర్యాల లారీ అసోసియేషన్‌ను సందర్శించిన ఎస్సై.. రోడ్డు భద్రతపై సభ్యులకు అవగాహన కల్పించారు. జాతీయ రహదారిపై లారీలను నిలపడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొని ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు.కొద్దిసేపటి నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలకు ముప్పు అని...