అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. నాణ్యతలో రాజీ వద్దు పంచాయతీరాజ్ అధికారులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష కాకతీయ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. సీఆర్‌ఆర్, ఎంఆర్‌ఆర్ గ్రాంట్లు, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్,...