ద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి ఎన్‌టీఏ వ్యవస్థను రద్దు చేసి పారదర్శక పరీక్షలు నిర్వహించాలి జమ్మికుంటలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కాకతీయ, కరీంనగర్ / జమ్మికుంట : ఢిల్లీలో విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారిపై పోలీసులతో దమనకాండకు పాల్పడటం...