ప్ర‌భుత్వం ఎకరాకు రూ.10 వేల సాయం అంద‌జేయాలి

కాకతీయ, చందుర్తి: రాష్ట్రంలో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల సెస్ మాజీ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు అల్లాడి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెబుతూ రైతులకు ప్రత్యామ్నాయ...