బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరసన

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరసన రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన నేతలు కాకతీయ, పినపాక: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో భారీ నిరసన, ర్యాలీ నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పేరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వరుస పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు...