అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు

పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలి భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాకతీయ, ఏటూరునాగారం: అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వకుండా పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వైరల్ జ్వరాల నివారణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు...