అభివృద్ధి పనుల్లో నాణ్యతకు రాజీ లేదు

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర: అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పెద్దవంగర మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500...