రాహుల్ నిరసనలు బూటకపు డ్రామాలే
బీజేపీ జాతీయ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాకతీయ, ఖమ్మం టౌన్: ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న నిరసనలు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న బూటకపు డ్రామాలేనని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఖమ్మంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, నకిలీ ఓట్లు తొలగిపోతున్నాయనే భయంతోనే కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం...