రైస్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు నిలిపివేయాలి
రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లపై కొనసాగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేసి, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కోరారు. మంగళవారం జిల్లాలోని రైస్ మిల్లర్లు రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్కను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ...