కాంగ్రెస్ నేత కాసం లక్ష్మారెడ్డి కన్నుమూత
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం పాడే మోసిన ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ కాకతీయ, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన మృతి కాంగ్రెస్ శ్రేణులను విషాదంలో ముంచింది. నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి అందరితో ఆప్యాయంగా మెలుగుతూ, పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందారు. లక్ష్మారెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే డా. భూక్య మురళీ...