బండా బాదుడుపై విచారణేది..?
జీసీసీ గ్యాస్ వ్యవహారంపై ఉన్నతాధికారుల మౌనం ఆధారాలతో సహా అక్రమాలు బయటకు వచ్చిన చర్యలేవీ..? అక్రమార్కులకు అధికారులు మద్దతు తెలుపుతున్నట్లేనా..?! చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీ గ్యాస్ పంపిణీ వ్యవహారంలో అధికారిక ధరకు మించి వసూళ్లు, రసీదులు జారీ చేయకపోవడం, వ్యక్తిగత యూపీఐ ఖాతాలకు నగదు బదిలీలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికారిక విచారణ ప్రారంభం కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై జూలై 25న కాకతీయ...