ఆర్వోబీ జాప్యంపై బండి సంజయ్ ఆగ్రహం

ప్రజల ఇబ్బందులపై అధికారులను నిలదీత..ప్రత్యామ్నాయ పనులకు మేయర్‌కు ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యం, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ వృద్ధురాలు ఆర్వోబీ సమీపంలోని కల్వర్టులో పడిపోయిన ఘటనపై స్పందించిన ఆయన, అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని...