సుందరగిరి శ్రీ వేంకటేశ్వరునికి భక్తుల కానుకలు..
హుండీ లెక్కింపులో రూ.1,92,184 ఆదాయం కాకతీయ, చిగురుమామిడి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. గత పది నెలలుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ద్వారా మొత్తం రూ.1,92,184 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండపర్తి రాజ్‌కుమార్ తెలిపారు. భక్తులు తమ మొక్కుబడుల రూపంలో నగదుతో పాటు వివిధ రకాల కానుకలను కూడా సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. హుండీ...