భూపతిపూర్‌లో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రం పరిశీలన

ఓటర్ల సౌకర్యాలపై ఆర్‌డీఓ కృష్ణవేణి సమీక్ష కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల నమోదు అధికారి, ఆర్‌డీఓ కృష్ణవేణి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం చిట్యాల గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని భూపతిపూర్‌కు మార్చే ప్రతిపాదన నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయనున్న కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవసరమైన ర్యాంప్‌, మరుగుదొడ్లు, భవనం స్థితి, ఇతర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేంద్రం ఏర్పాటు...