ఎమ్మార్వో ఆఫీసులో ప్రైవేటు రాజ్యం..!
ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూభారతి రిజిస్ట్రేషన్లు..? ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లు? అడిగినంత ఇవ్వకపోతే 'సర్వర్ పనిచేయడం లేదు' అంటున్నారంటున్న రైతులు అధికారుల సాక్షిగానే వసూళ్ల దందా సాగుతోందని తీవ్ర ఆరోపణలు కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే నిర్వహించాల్సిన భూభారతి రిజిస్ట్రేషన్లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కార్యాలయ వ్యవహారాలు నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన...