వెలుగుమట్ల బాధితుల నిరసనకు అంబేద్కర్ మనవడు రాక
ఆగస్టు 1న భారీ నిరసన ర్యాలీ నిర్వహణ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకండి రాంబాబు కాకతీయ, ఖమ్మం టౌన్: వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటలకు జడ్పీ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకండి రాంబాబు తెలిపారు. గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెలుగుమట్లలోనే బాధితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్...