చెరిగిపోని ఉద్యమ ముద్ర… పెద్ది
చెరిగిపోని ఉద్యమ ముద్ర... పెద్ది కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని పేర్లు కాలగర్భంలో కలిసిపోవు. పోరాటం గురించి మాట్లాడినప్పుడల్లా, ఉద్యమ జెండా రెపరెపలాడినప్పుడల్లా గుర్తుకొచ్చే నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన రోజుల్లో ఆయన పేరు ఒక వ్యక్తిని మాత్రమే సూచించేది కాదు... ఉద్యమానికే ప్రతీకగా మారింది. రాస్తారోకో అయినా, బంద్ అయినా, దీక్ష అయినా, జైలు భరో కార్యక్రమం అయినా... ముందుండేది పెద్ది. ఉద్యమం ఎక్కడ ఉంటే అక్కడ...